జిల్లాకేంద్రంలో గురుకులాల ఆర్సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి
నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాకేంద్రంలో గురుకులాల ఆర్సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి పీడీఎస్ యూ ఆధ్వర్యంలో వినితిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఆర్సీవో కార్యాలయాలు రూరల్ ప్రాంతంలో గురుకుల పాఠశాలల మరియు కళాశాలల ప్రాంగణంలో ఉన్నాయన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పనుల...