Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 August 2025, 3:29 pm Posted by : ramakrishna

జిల్లాకేంద్రంలో గురుకులాల ఆర్సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాకేంద్రంలో గురుకులాల ఆర్సీవో కార్యాలయాలు ఏర్పాటు చేయాలని పీడీఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  ప్రజావాణిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డికి  పీడీఎస్ యూ ఆధ్వర్యంలో  వినితిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో మూడు జిల్లాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ  మైనారిటీ ఆర్సీవో కార్యాలయాలు రూరల్ ప్రాంతంలో గురుకుల పాఠశాలల మరియు కళాశాలల ప్రాంగణంలో  ఉన్నాయన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు పనుల నిమిత్తం ఆర్సీవో కార్యాలయానికి వస్తే లోపలికి స్కూల్ వర్కింగ్ ఆవర్ లో రానివ్వడం లేదన్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలో  అందరికి అందుబాటులో ఆర్సీవో కార్యాలయాలు ఉండాలని డిమాండ్ చేశారు.   కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కూడా  సానుకూలంగా స్పందించి ప్రభుత్వనికి లేఖ రాసి ఏర్పాటుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ యూ నాయకులు మనోజ్,సాయికిరణ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RCO offices of Gurukuls should be established in the district headquarters.