వెబ్ డెస్క్, బతుకమ్మ : ఐపీఎస్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు బోణీ కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ను వారి సొంత గడ్డపై 7వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 16.2ఓవర్లలోనే 3వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ (59 నాటౌట్, 36బంతుల్లో 4ఫోర్లు, 3సిక్స్ లు), ఫిల్ సాల్ట్ (56, 31బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్స్ లు) అర్ధ శతకాలతో చెలరేగారు. కెప్టెన్ రజత్ పటిదార్ (34, 16బంతుల్లో) రాణించాడు. కోల్ కతా బౌలర్లలో వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ ఒక్కో వికెట్ తీశారు.