Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 October 2024, 5:34 pm Posted by : ramakrishna

రాజనీతి శాస్త్రంలో రవీందర్ కు డాక్టరేట్

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న టి రవీందర్ కు డాక్టర్ రావడం సంతోషకరమని కళాశాల ప్రిన్సిపాల్ టీ.పెద్దన్న అన్నారు. టీ.రవీందర్ కు రాజనీతి శాస్త్రంలో *స్టడీ ఆన్ కాలేజ్ స్టూడెంట్ పొలిటికల్ యాక్టివిటీ అండ్ ఆన్లైన్ సోషల్ మీడియా*అనే అంశములో చేసిన పరిశోధనకు గాను సన్ రైజ్ యూనివర్సిటీ రాజస్థాన్ నుండి డాక్టరేట్ పట్టా పొందిన సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న, ఉపాధ్యాయ బృందం ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపాల్ పెద్దన్న మాట్లాడుతూ 2009 నుండి మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సేవలందిస్తున్నారని మధ్య తరగతికి కుటుంబాన్ని నుండి వచ్చి ఉన్నత స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణం అని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా యెన్మాన్ బెట్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ వెంకటయ్యల కుమారుడైన రవీందర్ డిగ్రీ, పీజీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి పూర్తి చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మర్రెపల్లి భూపతి ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Ravinder's Doctorate in Political Science