Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 February 2025, 12:38 pm Posted by : ramakrishna

హైకోర్టును ఆశ్రయించిన రవీందర్ సింగ్

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్సీ అభ్యర్థి, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ మేలా సత్ఫతి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పలు ఆరోపణలతో ఈనెల 19న హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు శుక్రవారం నంబర్ ను అలాట్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల పలు పిటిషన్లు వచ్చినా హైకోర్టు ఈదశలో విచారణకు తీసుకోలేమని కొట్టివేసింది. కానీ, రవీందర్ సింగ్ పిటిషన్ విచారణకు స్వీకరించడం విశేషం.