Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 9:55 am Posted by : ramakrishna

బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం

 

. . .  కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించిన ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బాన్సువాడలోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వీక్షించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రావణదహనంతో మినీ స్టేడియం పండుగ సందడితో కళకళలాడింది.

Ravana Dahan event held on a grand scale in Banswada

అనంతరం బాన్సువాడ గ్రామీణ మండలంలోని తన స్వగ్రామమైన పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి  గ్రామస్థులకు జమ్మి ఆకులను పంపిణీ చేస్తూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ పాల్గొన్నారు.

Ravana Dahan event held on a grand scale in Banswada