Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 August 2025, 10:46 pm Posted by : ramakrishna

సెప్టెంబర్ 1 నుంచి రేషన్‌ షాపుల బంద్‌

  • ప్రభుత్వానికి రేషన్‌ డీలర్ల అల్టిమేటం
  • బకాయిలు చెల్లిస్తేనే రేషన్‌ పంపిణీ
  • 125 కోట్ల బకాయిలు పెండింగ్‌
  • సెప్టెంబర్ 4న అసెంబ్లీ ముట్టడికి పిలుపు

 

హైదరాబాద్, బతుకమ్మ : రేషన్‌ డీలర్లు పోరుబాట పట్టారు. కమీషన్‌ బకాయిల కోసం కాంగ్రెస్‌ సర్కారుకు ఎంత మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కుతున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ దుకాణాలు బంద్‌ చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. వచ్చే నెల నుంచి బియ్యం పంపిణీ చేయబోమని తేల్చి చెప్పారు. బియ్యం పంపిణీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్లు పౌరసరఫరాల భవన్‌ ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రేషన్‌ దుకాణాల బంద్‌ ప్రకటన చేశారు. దీంతోపాటు ఆందోళనకు సంబంధించి కార్యాచరణను వెల్లడించారు. సర్కారు మొండికేస్తే వచ్చే సెప్టెంబర్ 4వ తేదీన అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు, సివిల్‌సప్లయ్‌ అధికారులకు ఇప్పటికే వినతిపత్రాలు ఇచ్చారు.