Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 10:11 pm Posted by : ramakrishna

రేషన్ దుకాణాలు ఓపెన్.. పిడిఎస్ దందా షురూ

  • టన్నునర రేషన్ బియ్యం పట్టివేత

 

నిజామాబాద్ క్రైo, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో రేషన్ బియ్యం మాఫియా రెచ్చిపోయింది. మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ జరిగే నెల రోజుల తర్వాత రేషన్ దుకాణాలు తెరిచారో లేదో అప్పుడే పి డి ఎస్ బియ్యాన్ని దారి మళ్లించే పనిని చేపట్టింది. నగరంలోని ఒకటవ టౌన్ పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో  సోమవారం సాయంత్రం దాడి నిర్వహించారు. నగరంలోని అశోక్ నగర్ లో పిడిఎస్ మాఫియా కీలక సూత్రధారుల గోదాం పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 30 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడింది. రేషన్ దుకాణాలు తెరిచిన తొలి రోజే రేషన్ బియ్యం పిడిఎస్ మాఫియా వద్దకు ఎలా వచ్చిందని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ మేరకు స్థానిక సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించినట్టు ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపారు. నగరంలో పిడిఎస్ మాఫియా రేషన్ బియ్యం దండ షురూ చేద్దామనుకున్న సమయంలోనే పోలీసుల మెరుపు దాడి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నగరంలో పిడిఎఫ్ మాఫియా లో రౌడీషీటర్లు రేషన్ డీలర్లు కుమ్మక్కై ఉండడంతో యూదేచ్ఛగా ఈ దందా జరుగుతోంది. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిడిఎస్ మాఫియా పై సీరియస్ గా ఉండడంతో ఈ దందాకు తొలిరోజే చెక్ పెట్టినట్లు అయింది.