గాంధారి, బతుకమ్మ : బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 32 క్వింటల్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసినట్లు గాంధారి సబ్ ఇన్స్పెక్టర్ బి.ఆంజనేయులు తెలిపారు. బొలెరో వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న కోటగిరి గ్రామానికి చెందిన మహమ్మద్ ఉమేర్ అదుపులోకి తీసుకొని అతనితో పాటు వివిధ గ్రామాల్లో నుండి రేషన్ బియ్యాన్ని కొనుక్కొని వేరే రాష్ట్రాలకు రవాణా చేస్తున్న తాడ్కోల్ గ్రామం బాన్సువాడ చెందిన అందె మనోహర్ ను అదుపులోకి తీసుకొనున్నట్లు తెలిపారు. పీడీఎస్ రేషన్ బియ్యం, బొలెరో వాహనాన్ని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి కేసు నమోదు చేసి, సంబంధిత అధికారులకు పీడీఎస్ రేషన్ బియ్యం అప్పగించినట్లు పేర్కొన్నారు. మండలంలో ఎవరైనా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని అక్రమంగా తరలించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలో అసాంఘిక చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.