బతుకమ్మ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గాంధీ చౌక్ కేంద్రంగా రేషన్ అక్రమ దందా జోరుగా కొనసాగుతుంది. ఇటీవల 10 కింటాల రేషన్ బియ్యంతో ఒక ఆటో, 35 టన్నుల రేషన్ బియ్యంతో ఒక లారీ దొరికినప్పటికిని ఏమాత్రం చలనం లేకుండా అక్రమ రేషన్ దందాను కొనసాగిస్తున్నారు. రేషన్ బియ్యం పంపకాలు ప్రారంభం నుండి ముగింపు వరకు నిరంతరాయంగా నిరాటకంగా ఈ దందా కొనసాగుతుందని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటూ ఉండగా బోగస్ రేషన్ కార్డులతో ఉన్నటువంటి లబ్ధిదారులు (అర్హత లేకుండా ఉన్నప్పటికిని బిపిఎల్ క్యాండెట్ గా వైట్ రేషన్ కార్డు తీసుకున్న వ్యక్తులు) ఏకంగా రేషన్ షాపు నుంచి డైరెక్ట్ గా అక్రమ బియ్యం వ్యాపారి వద్దకే తీసుకొస్తున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. బిచ్కుందలో ఓ రేషన్ షాప్ డీలర్ నుండి అక్రమ బియ్యం వ్యాపారికి వద్దకు బియ్యం సప్లై జరుగుతుందని ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికిని ఉద్దేశపూర్వకంగానే మౌనం వహిస్తున్నారని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా అక్రమ రేషన్ దందాకు పాల్పడుతున్న వ్యక్తులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని బిచ్కుంద గ్రామ ప్రజలు కోరుతున్నారు.