- రేషన్ దుకాణం వద్ద రేషన్ డీలర్ కోసం రేషన్ దారుల పడిగాపులు
- రేషన్ దారులకు తప్పని తిప్పలు
రుద్రూర్, బతుకమ్మ : వర్షాల నేపథ్యంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడొద్దని జూన్, జులై, ఆగస్టు నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఈ నెలలో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అసలే సన్నబియ్యం.. ఆపై పోర్టబిలిటీ కారణంగా ఎక్కడ తమ సమీప దుకాణంలోని బియ్యం అయిపోతుందేమోనని.. లబ్ధిదారులు చౌక ధరల దుకాణాలకు వరుస కడుతున్నారు. కాగా రుద్రూర్ మండల కేంద్రంలో ఓ రేషన్ డీలర్ ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తూ రేషన్ దారులకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రేషన్ దారులు ఆరోపిస్తున్నారు. ఆ రేషన్ డీలర్ సమయపాలన పాటించడం లేదని, ఇష్టం వచ్చినప్పుడు వస్తూ, వెళ్తున్నాడని, ఇలాగైతే రేషన్ దుకాణంలో మేము బియ్యం ఎలా తీసుకోవాలని రేషన్ దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కోసం రేషన్ దుకాణం వద్ద పడిగాపులు కాస్తున్నామన్నారు.రేషన్ డీలర్ ఇష్టారీతిన వ్యవహరించడంతో రేషన్ దారులకు తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి ఆ రేషన్ డీలర్ పై తగు చర్యలు తీసుకోవాలని రేషన్ దారులు కోరుతున్నారు.