అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
వెబ్ న్యూస్, బతుకమ్మ : కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే దరఖాస్తు చేసిన కుటుంబాలు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే కార్డులు జారీకి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కొత్త కార్డులకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.