Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 1:43 pm Posted by : ramakrishna

అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలి

సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :  అర్హులందరికి రేషన్ కార్డులు ఇవ్వాలని సీపీఎం నగర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.  పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు వెంటనే అప్రూవ్  చేయాలన్నారు. ఈమేరకు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ  ప్రభుత్వ పథకాల లబ్ధి పొందాలంటే తెల్ల రేషన్ కార్డు అవసరమని, అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం రేషన్ కార్డు అందజేయాలన్నారు. దళారులు అధికారుల మధ్యలో ప్రజలు నలుగిపోతున్నారని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం కార్యవర్గ సభ్యులు కటారి రాములు,  నగర కమిటీ సభ్యులు అనిత, నరేష్ తదితరులు పాల్గొన్నారు.