– లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ
– ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
రుద్రూర్, బతుకమ్మ :
రేషన్ కార్డు అంటే ఆహార భద్రత అని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు లక్షల 12 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇల్లు కట్టుకున్న వారికి బిల్లులు రాకపోతే ఇందిరమ్మ ఇండ్ల కింద మంజూరు చేయడం జరుగుతుందని, రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇల్లు కట్టుకొని బేస్మెంట్ వరకు బిల్లు వచ్చిన వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి బిల్లులు చెల్లించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.