⁠వేడుకగా రథోత్సవం

భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగిన భక్తులు కొనసాగుతున్న శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి  బ్రహ్మోత్సవాలు తిరుపతి, బతుకమ్మ: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో కొనసాగుతున్నాయి. ఎనిమిదో రోజైన మంగ‌ళ‌వారం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌స్వామి ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది. భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి...