Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 3:31 pm Posted by : ramakrishna

కలెక్టరేట్ లో రాష్ట్రీయ ఏక్తా దివస్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

రాష్ట్రీయ ఏక్తా దివస్ ను పురస్కరించుకుని శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో ప్రతిజ్ఞ చేశారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు తదితరులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం, అధికారులు, సిబ్బందిచే జిల్లా రెవెన్యూ అధికారిణి గీత ప్రతిజ్ఞ చేయించారు. దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకితభావంతో కృషి చేస్తానని, తోటి వారందరిలో ఈ భావనను పెంపొందించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని, సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికతతో దేశానికి సమకూరిన అంతర్గత భద్రతను పటిష్టపరిచేందుకు తోడ్పాటును అందిస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.