Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 January 2026, 2:59 pm Posted by : ramakrishna

మెడికవర్ హాస్పిటల్స్ లో అరుదైన గుండె శస్త్రచికిత్స

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్‌  మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. శుక్రవారం నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డా. రాకేష్ మాట్లాడుతూ 24 సంవత్సరాల వయస్సు గల ఒక అబ్బాయికి గుండెలో ఉన్న లోపమైన అట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ ను సంప్రదాయ ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండా, మినిమల్ ఇన్వేసివ్ పద్ధతిలో చికిత్స చేశామన్నారుఈ అత్యాధునిక శస్త్రచికిత్సను కార్డియోథొరాసిక్ సర్జన్ డా. రాకేష్ నేతృత్వంలో వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ విధానం ద్వారా రోగికి తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం ఉండటంతో పాటు త్వరగా కోలుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఇలాంటి శస్త్ర చికిత్స నిజామాబాద్ లో మొట్ట మొదటి సారిగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అనస్తీషియాలజిస్ట్ డా. వను మాట్లాడుతూ“ఓపెన్ హార్ట్ లేకుండా నిర్వహించే మినిమల్ ఇన్వేసివ్ గుండె శస్త్రచికిత్సల్లో అనస్తీషియా అత్యంత కీలకమన్నారు. రోగి భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి, ఆధునిక అనస్తీషియా విధానాలతో శస్త్రచికిత్సను సజావుగా పూర్తి చేశామని తెలిపారు.నిజామాబాద్ జిల్లాలో ఈ తరహా ఓపెన్ హార్ట్ లేకుండా  అట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ సర్జరీ మొట్టమొదటిసారిగా మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించబడడం విశేషం అని సెంటర్ హెడ్ స్వామి అన్నారు. ఇలాంటి సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో డి యం ఎస్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ పాల్గొన్నారు.