Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 September 2024, 12:12 pm Posted by : ramakrishna

ఆరేళ్ల బాలిక పై అత్యాచారం

 కామాంధుడి పై పొక్సో కేసు నమోదు.
బతుకమ్మ, నవీపేట్ :

కామం తో కళ్ళు ముసుకుపోయి అభం శుభం తెలియని 6 ఏళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లోని ఒక గ్రామంలో 6 ఏళ్ల చిన్నారి పై అదే గ్రామానికి చెందిన యువకుడు ఆదివారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నట్లు ఎస్సై వినయ్ తెలిపారు.