Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 May 2025, 6:44 pm Posted by : ramakrishna

రాపల్లి శ్రీనివాస్ కు మే డే శ్రమశక్తి పురస్కారం

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే  సందర్భంగా కార్మిక సంక్షేమం కోసం విశేషంగా కృషి చేసినందుకు  కార్మిక శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మే డే శ్రమ శక్తి పురస్కారం ను రాపెళ్లి శ్రీనివాస్ కు అందజేసింది. బీడీ కార్మికుల సంక్షేమ ఆర్థిక అభివృద్ధి కోసం గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీ కార్మికుల సంక్షేమo,పెన్షన్ కోసం జీవన భృతి కోసం అహర్నిశలు కృషిచేసి పోరాటాలు చేసిన రాపల్లి శ్రీనివాస్ కి శ్రమశక్తి పురస్కారం 2025 ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ ఎం.దాన కిషోర్, ఉన్నత కార్మిక శాఖ అధికారులు హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో మే డే రోజున అందజేశారు.  ఎన్నికల ప్రక్రియ ద్వారా నాలుగు సార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సంఘటిత, అసంఘటిత రంగాలలో కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో కార్మిక కోసం కేటాయించాలని, సంక్షోభంలో ఉన్న బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు జీవన భృతిని, పెన్షన్ అమలు చేయాలని ఎన్నికల ప్రక్రియ ద్వారా జీవన భృతి సాధించారు. లేబర్ రైట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులుగా శ్రీనివాస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను కార్మిక విద్యా సంస్థ ద్వారా గతంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.  కార్మికులకు ఆయన చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని రవీంద్రభారతిలో కార్మిక శాఖ మే డే శ్రమశక్తి పురస్కారం అందజేసింది.

Rapalli Srinivas receives May Day Shramshakti Award