రెంజర్ల పాఠశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు
ముప్కాల్, బతుకమ్మ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ 2025 పురస్కారాలను ప్రకటించింది. పాఠశాలల విభాగం లో ప్రకటించిన 3 పురస్కారాలలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం మండలం లోని జెడ్పిహెచ్ఎస్ రెంజర్ల పాఠశాలకు ద్వితీయ స్థానం దక్కింది. గత విద్య సంవత్సరంలో చేపట్టిన వివిధ పర్యావరణ స్నేహపూర్వక కృత్యలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని అనగా నీటిసంరక్షణ, వ్యర్థలా...