Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 June 2025, 7:31 pm Posted by : ramakrishna

రెంజర్ల పాఠశాలకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు

ముప్కాల్, బతుకమ్మ: ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన సంస్థలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రస్థాయి గ్రీన్ ఛాంపియన్ 2025 పురస్కారాలను ప్రకటించింది. పాఠశాలల విభాగం లో ప్రకటించిన 3 పురస్కారాలలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం మండలం లోని జెడ్పిహెచ్ఎస్ రెంజర్ల పాఠశాలకు  ద్వితీయ స్థానం దక్కింది. గత విద్య సంవత్సరంలో చేపట్టిన వివిధ పర్యావరణ స్నేహపూర్వక కృత్యలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని  అనగా నీటిసంరక్షణ, వ్యర్థలా నిర్వహణ మరియు చెట్లను నాటడంను మే  31 నాడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించాడు. గురువారం నాడు సనత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర  కాలుష్య నియంత్రణ బోర్డు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో రెంజర్ల పాఠశాల జీవశాస్త్ర ఉపాద్యాయుడు సుద్దపల్లి మల్లేష్ ఈ పురస్కారాన్ని పర్యావరణ,అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ,ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్.నదిమ్,మెంబర్ సెక్రటరీ రవి గుగులోతు చేతులమీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ ను జిల్లా విద్యాధికారి పార్సి అశోక్,జిల్లా సైన్స్ అధికారి గంగకిషన్,ఏ ఎం ఓ శ్రీనివాస్  ,పాఠశాల హెడమాస్టర్ రవికుమార్, స్కూల్  సహా ఉద్యోగులు అభినందించారు.