బీఈడీ కళాశాలలో ఆకట్టుకున్న రంగవల్లి పోటీలు

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని అమ్మద్ బిఎడ్ కళాశాలలో మంగళవారం ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ లో భాగంగా ముగ్గుల పోటీలను  నిర్వహించారు. ఈ మేరకు ప్రిన్సిపాల్ ఎండి హనీఫ్ పాషా  మాట్లాడుతూ చాత్రోపాధ్యాయులు సమాజంలో ఉన్న స్థితిగతులు సామాజిక అంశాలు ప్రతిబింబించేలా ముగ్గులు వేయడం జరిగిందన్నారు. కళాశాల ఆవరణలో హరివిల్లును తలపించేలా అందమైన రంగవల్లులు సామాజిక అంశాలతో కూడిన ముగ్గులు వేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు. ముగ్గులు వేసిన చాత్రోపాదాయులను కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో...