Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 January 2025, 7:09 pm Posted by : ramakrishna

కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు

కామారెడ్డి, బతుకమ్మ: సంక్రాంతి సంబరాలు 2025 నుపురస్కరించుకుని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు.  కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో   గురవారం జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అసిస్ సంగ్వాన్ ముఖ్యఅతిథిగా ,అడిషనల్ కలెక్టర్  విక్టర్, జిల్లా అధికారులు టిఎన్ జిఓ జిల్లా కార్యవర్గం పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులకు ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణీతలుగా  జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి రజిత వ్యవహరించారు.

Rangavalla competitions for women employees in the Collectorate premises

మొదటి బహుమతి వీణ, స్రవంతి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారికి ద్వితీయ బహుమతి, సౌమ్య జమున బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తృతీయ బహుమతి, ప్రియాంక  పోస్టల్ శాఖ ఐడిఓసి కి నాలుగవ బహుమతి, రాజ్యలక్ష్మి స్వప్న ట్రెజరీ డిపార్ట్మెంట్ వారికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగుల ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతి ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు అన్ని రంగాల్లో ముందు ఉండి జిల్లా కార్యాలయాల్లో వారి పనులను సంతృప్తికరంగా నిర్వహించుకుని మంచి పేరును తీసుకురావాలని కోరినారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా ఉద్యోగులకు అభినందనలు తెలియజేశారు.

Rangavalla competitions for women employees in the Collectorate premises