కలెక్టర్, అబ్జర్వర్ సమక్షంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో రెండవ విడత ఎన్నికలు జరుగనున్న మండలాల పోలింగ్ సిబ్బంది మలి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, జనరల్ అబ్జర్వర్ శ్యాంప్రసాద్ లాల్ సమక్షంలో నిర్వహించారు ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ నిర్వహించిన ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్లు నిశితంగా పరిశీలించారు. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్ లోని ఒక్కో మండలం వారీగా ఆయా గ్రామ పంచాయతీల...