పట్టణ ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ నగరంలోని సీతారాం నగర్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ ఓ మాట్లాడుతూ సిబ్బంది అందరూ సమయపాలన పాటించాలని,రోగులతో మర్యాదగా ఉండాలని అన్నారు. ఆరోగ్య కేంద్రంలోని మందులు నిల్వను,టీకాలు నిల్వచేసే ఫ్రిడ్జ్ ను, ల్యాబ్ ను,పరిశీలించారు. ఫార్మసిస్టులు ముఖ్యంగా మందుల నిల్వను ఉండేలా చూస్తూ,టీకాలు నిల్వచేసే ఫ్రిడ్జ్ లో టెంపరేచర్ ని రోజూ రికార్డు చేయాలని అన్నారు. ఎన్సీడీ స్క్రీనింగ్, ఎం సి...