Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 November 2024, 6:26 pm Posted by : ramakrishna

ప్రభుత్వ పాఠశాలల ఆకస్మిక తనిఖీ

బతుకమ్మ,భీంగల్: భీంగల్ మండలం కుప్కాల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ను ఎంపీడీవో సంతోష్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెనూ ప్రకారం వసతులు అందుతున్నాయా లేదా అని ఆయన ఆరా తీశారు. ఉపాధ్యాయుల పనితీరును విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. సెలబస్ పూర్తి, వంటకాలను సమృద్ధిగా, రుచిగా ప్రతిరోజు నిర్వహిస్తున్నారా లేదా అని విద్యార్థిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వంటపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల రిజిస్టర్లను పరిశీలించి, ప్రతిరోజు ప్రభుత్వం ఇచ్చిన మెనూప్రాకారమే అమలు చేయాలని అలా చేయని యెడల వారిపై తగు చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. క్రమశిక్షణలో చదువులో విద్యార్థినీ విద్యార్థులు ముందంజలో ఉండేలా మీ వంతు ప్రయత్నం చేయాలని ఆయన వారికి తెలియజేశారు.