. . . రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, బతుకమ్మ :
రంజాన్ పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలో ఆనందోత్సాహాల మధ్య ఈద్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు. పట్టణంలోని ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఆయన ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో సౌహార్దం, ఐక్యత మరింత బలపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డితో పాటు బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
