Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 April 2025, 1:11 pm Posted by : ramakrishna

భద్రాచలంలో ఘనంగా రాములోరి కల్యాణం

పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్

వెబ్ న్యూస్, బతుకమ్మ:  శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు సీతమ్మ వారి మెడలో మూడు మూళ్లు వేశారు. మిథిలా మైదానంలో ఈకల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. సీఎం రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు , ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తన సతీమణి గీతతో కలిసి ఈవేడుకల్లో పాల్గొన్నారు.  తెలుగు రాష్ట్రాల  నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రులు పొంగులేటి, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Ram's wedding celebrated in Bhadrachalam


Ram's wedding celebrated in Bhadrachalam