Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 8:27 pm Posted by : ramakrishna

కుళ్ళిన మాంసం విక్రయాల జోరు..!

 

. . . ప్రజల ఆరోగ్యాల బేజారు..!

 

. . . ప్రజల నుండి భారీగా డబ్బులు దండుకుంటున్న వ్యాపారులు

 

. . . షాప్ యజమానులను పట్టించుకోని ఫుడ్ ఇన్స్ పెక్టర్ లు

 

. . . జిల్లా డిఎంహెచ్ఓ పర్యవేక్షణ లోపం

 

. . . మామూళ్లు ఘణం..తనిఖీలు శూన్యం

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి మండల కేంద్రంలో చికెన్, మటన్ అమ్మే వ్యాపారులు వివిధ రోగాలతో చనిపోయిన మేకలను ఫ్రిజ్ లో పెట్టి మరునాడు దుకాణం షాపుకు తీసుకొచ్చి గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారు. మటన్ షాప్ యజమానులు ప్రజలకు మాయమాటలు చెప్పి కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు. ఇంటికి షాపు నుండి తీసుకెళ్లిన మాంసాన్ని(మటన్) వండుకుని తినడంతో మోషన్స్, దగ్గు, దమ్ము, నరాల బలహీనత, అనారోగ్యం పాలవుతుండడం వంటివి జరుగుతున్నాయి.

 

Rampant sale of rotten meat!

 

మటన్ షాపు యజమానులు ప్రజల నుండి భారీగా డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకొని కుళ్ళిన మాంసంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా దర్జాగా విక్రయాలు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఇప్పటివరకు జిల్లా అధికార డిఎంహెచ్వో పర్యవేక్షణ సందర్భాలు లేవు. దీనికి తోడు ఫుడ్ ఇన్స్ పెక్టర్ లు నామమాత్రంగా తనిఖీలు చేయడము పట్ల ప్రజల నుండి భారీగా విమర్శలున్నాయి. దీనికి కారణం మామూళ్ల పరంపర కొనసాగుతుండడమే కారణమా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార డిఎంహెచ్వో యంత్రాంగం, ఫుడ్ ఇన్స్ పెక్టర్ లు తేరుకొని కుళ్లిన మాంసాలను అమ్ముతున్న షాపులను తనిఖీ చేసి షాప్ యజమానుల పైన కఠిన చర్యలు తీసుకొని ప్రజల ఆరోగ్యాలని కాపాడాలని కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు అనారోగ్యాల పాలు కాకుండా ఫుడ్ ఇన్స్ పెక్టర్ లు షాపులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ప్రజల ఆరోగ్యాలను కాపాడతారని ఆశిద్దాం. మరి జిల్లా అధికారులు తేరుకుంటారో లేదో.. లేదా మామూళ్ల మత్తులోనే ఉంటారో వేచి చూడాల్సిందే.

 

Rampant sale of rotten meat!