. . . పోలీసులకు ఫిర్యాదు చేసినా యువకుడిపై దాడి
. . . పంచ్ లు, రాడ్ లతో దాడి చేయడంతో యువకుడికి తీవ్ర గాయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలో పట్టపగలు రౌడిలు రెచ్చిపోయారు. యువకుడు తమపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహించిన నలుగురు యువకుడిని పట్టపగలు రాడ్ లతో, పంచ్ లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖిల్లా రోడ్డులో మంగళవారం మధ్యాహ్నం జరిగింది.

శాంతినగర్ కు చెందిన ముజామిల్ ఖాన్ (30) ఇటీవల తన ఇంటి వద్ద కొందరు పోకిరిలు బెదిరింపులకు పాల్పడుతు న్నారని ఈ నెల 14న 5వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

యువకులు రాత్రివేళ న్యూసెన్స్ చేస్తుండడంతో డయల్ 100 కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని గుంపును చెదరగొట్టారు. ముజామిల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో దానిని మనస్సులో పెట్టుకున్న ఖిల్లా రోడ్డు, శాంతినగర్ లకు చెందిన నలుగురు యువకులు పంచ్ లు, రాడ్ లతో దాడి చేశారు. ఈ ఘటనలో ముజామిల్ తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
