. . . కామారెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక
కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన అన్మాల రామ్‌కుమార్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ యువ నాయకుడిగా ముందుకు వస్తున్నారు. తాజాగా ఆయన కామారెడ్డి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు, యువత ఆయనకు అభినందనలు తెలుపుతూ రామ్‌కుమార్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తండ్రి 1985 నుంచి 2000 వరకు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగుతూ 1991 వచ్చిన ఎలక్షన్ లో విజయం సాధించి చిన్నమల్లారెడ్డి పీఎసీఎస్ చైర్మన్‌గా కామారెడ్డి పీఎసీఎస్ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన కీలక పాత్ర పోషించి మంచి పేరు సంపాదించారు. తండ్రి అడుగుజాడల్లోనే రామ్‌కుమార్ కూడా ప్రజాసేవ వైపు అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. గత ఏడాది వార్డు సభ్యుడిగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో కూడా విజయం సాధించి తన నాయకత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు. ఈ సందర్భంగా రామ్‌కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి, గూడెం శ్రీనివాస్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువతను పార్టీ వైపు మరింతగా ఆకర్షించి, గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు.