రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి అరెస్ట్‌

వెబ్ డెస్క్, బతుకమ్మ:  కర్ణాటక  రాష్ట్రం లోని బెళగావి లో 17 ఏళ్ల బాలికపై స్వామీజీ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రామలింగ మఠాధిపతి లోకేశ్వరస్వామి రాయచూర్‌లోని ఓ లాడ్జిలో 2 రోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికను బాగల్‌కోటేకు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేసి మహాలింగపుర బస్టాండ్‌లో బాలికను వదిలేసిన స్వామి, ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేయడంతో  లోకేశ్వరస్వామిపై అత్యాచారం, కిడ్నాప్‌ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు కర్నాటక పోలీసులు.