రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణారావు
బతుకమ్మ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ కె.రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్)రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ ఐఏఎస్ రామకృష్ణారావు ప్రస్తుతం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నారు. ఆయనను ఈ నెల 30న పదవి విరమణ చేయనున్న శాంతికుమారి స్థానంలో నియమించారు.