Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 March 2026, 7:52 pm Posted by : ramakrishna

రంజాన్ పర్వదినం ఐక్యతకు నిదర్శనం

 

. . . ఏర్గట్ల లో ఈద్గా వద్ద రంజాన్ వేడుకల్లో ఎండి అన్వర్

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

రంజాన్ పర్వదినం ఐక్యతకు నిదర్శనం అని ఎండి అన్వర్ అన్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా టెంట్లు, వాటర్ ఏర్పాట్లు చేసుకొని వేడుకలను మరింత ఉత్సాహంతో జరుపుకున్నారు. రంజాన్ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ సందర్భంగా ఒకరినొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎండి మునీర్, షేక్ రషీద్, షేక్ యూసుఫ్, షేక్ సద్దాం, ఎండి జమాల్, షేక్ కాసిం, షేక్ గఫూర్ లు పాల్గొన్నారు.