నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫాల అందజేత
. . . బీఆర్ఎస్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ గ్రామంలో 25 నిరుపేద ముస్లిం కుటుంబాలకు సోమవారం కొత్తపల్లి రవి కిరణ్ రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫాలను అందజేయడంతో వారు ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్, మైనార్టీ నాయకులు వసిం, అఫ్రోజ్, మోబిన్, నిజాం తదితరులు పాల్గొన్నారు.