నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి సందర్భంగా విగ్రహానికి ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ రమాబాయి త్యాగం మరచిపోలేనిదని అన్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ మన దేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా గుర్తించుకునే విధంగా చరిత్రలో నిలిచారంటే అంటే వారి సతీమణి తన సర్వస్వం త్యాగం చేసి సహకరించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు.