ముప్కాల్, బతుకమ్మ :
డ్రగ్స్ రహిత సమాజాన్ని మేలుకోల్పాలని కోరుతూ నాయకుడు సంతోష్ ఫౌండేషన్ ,పోలీస్ శాఖ ల ఆధ్వర్యంలో యువకుల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆదివారం ముప్కాల్ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ పాల్ మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ రహిత సమాజాన్ని మేల్కొల్పాలి, దానికి యువకులు తోడ్పడాలని, ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలపాలన్నారు.

అనంతరం నాయకుడు సంతోష్ ఫౌండేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇది యువత చెడు మార్గంలో నడిపించే తీవ్రమైన సమస్య, దీనివల్ల శరీరానికి హాని జరుగుతుంది డ్రగ్స్ రహిత మండలం లో నిర్మించడానికి తనవంతు కృషి తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ ఏఎస్ఐ గంగారం, సిబ్బంది బ్రహ్మ, సాయి, గ్రామస్థులు శ్రావణ్, నరసయ్య, రాకేష్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.