Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 1:50 pm Posted by : ramakrishna

ప్రూడెన్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  ర్యాలీ

నిజామాబాద్, బతుకమ్మ :  నగరంలోని  ప్రూడెన్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో  వరల్డ్ హర్ట్ డే సందర్భంగా  అవగాహన ర్యాలీ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా డా. గౌతమ్ రెడ్డి  ఈ సంవత్సరానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంశం “DON’T MISS A BEAT” (ఒక గుండె తపనను కూడా మిస్ కావద్దు) – గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జాగ్రత్తలను వివరించారు.  తరచూ హెల్త్ చెక్-అప్స్ చేయించుకోవడం, జంక్ ఫుడ్‌ను దూరంగా ఉండాలని సూచించారు.  సమతుల్యమైన ఆహారం, వ్యాయామం, ఒత్తిడి నియంత్రణ ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు.   ఈ సందేశాన్ని కొనసాగిస్తూ డా. భైరవ నాథ్, డా. కిరణ్, డా. రవి మాట్లాడుతూ, నిజామాబాద్ ప్రజలకు ప్రూడెన్స్ హాస్పిటల్స్ 20కి పైగా విభాగాలు మరియు పూర్తి స్థాయి కన్సల్టెంట్లతో ఒకే చోట అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామ‌ని తెలిపారు. అదనంగా, ఇటీవల ఆంకాలజీ విభాగంను పూర్తి స్థాయి కన్సల్టెంట్‌తో ప్రారంభించి, ప్రత్యేక వైద్య సేవలను మరింత బలోపేతం చేశామని తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో డా. దివ్య భైరవ, డా. మయూరి, డా. విన్నూత, .దీప్తి డా. శ్రావ్య, బొబ్బిలి నరేష్ రావు, డా. శాంతి సింగ్, డా. స్నేహిత, మంజుల,  రాజ్ కిరణ్ తో పాటు ఆస్పత్రి సిబ్బంది మరియు ప్రజలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు.

Rally organized by Prudence Hospital