Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 October 2025, 6:31 pm Posted by : ramakrishna

బోధన్‌లో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

బతుకమ్మ, బోధన్: పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా శనివారం బోధన్ పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ఆచెన్‌పల్లి చౌరస్తా నుండి అంబేడ్కర్ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో అధికారులు, సిబ్బంది పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకటనారాయణ, సీఐ విజయ్ బాబు, కృష్ణ, మచ్చేందర్ రెడ్డి, చంద్రమోహన్, సునీల్, సాయన్న తదితరులు పాల్గొన్నారు.