టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా

కామారెడ్డి, బతుకమ్మ :  టీయూడబ్ల్యూజే (ఐజేయు) కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాదులో సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడికి నిరసనగా జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ మాట్లాడుతూ  మోహన్ బాబు ఇంటి ముందు ఆయన కుమారుడు మంచు మనోజ్ తో గొడవ జరుగుతుందన్న సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కవరేజ్ కి...