వర్ని, బతుకమ్మ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వర్ని శాఖ కేంద్రంలో గల ప్రభుత్వ పాఠశాల, మోడల్ పాఠశాల, కళాశాలలో విద్యార్థినీ విద్యార్థులతో కలిసి ఏబీవిపి రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శనం ప్రవీణ్ మాట్లాడుతు రాఖీ పండుగకు పురాణాల్లో ఉన్న ప్రాధాన్యతను వివరించారు. దేవతల యుద్ధ విజయం, ద్రౌపది-శ్రీకృష్ణుల అనుబంధం, లక్ష్మీదేవి- బలిచక్రవర్తి ఘటనల ద్వారా రక్షాబంధన్ ప్రాచీనతను వివరించారు. భారతీయ సంస్కృతి, సోదర సోదరీమణుల అనుబంధాన్ని గుర్తుచేసేలా ఈ వేడుక జరిగింది. ABVP సంస్కృతిని, సాంప్రదాయాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ప్రతి విద్యార్థి పట్ల సోదర భావం కలిగి ఉండాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్ని నగర కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
