Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2025, 2:26 pm Posted by : ramakrishna

వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు రాజ్యసభ ఆమోదం

డిల్లీ, బతుకమ్మ : వక్ఫ్ సవరణ బిల్లు నివేదికకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ‘వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లు-2024’పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం జరిపింది. జేపీసీ నివేదికను కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. ఈనేపథ్యంలో సభలో విపక్షాలు ఆందోళన చేశాయి.  వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమించడంపై విపక్ష నేత మల్లికార్జు ఖర్గే అభ్యంతరం తెలిపారు. తాము ఇచ్చిన సూచనలు, సలహాలను నివేదికలో పొందుపర్చకపోవడంపై ఖర్గే మండిపడ్డారు. జేపీసీ చైర్మన్‌ జగదంబికా పాల్‌, బీజేపీ ఎంపీ సంజయ్‌ ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు.