Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2025, 12:40 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో రాజసభ్య ఎంపీకి గాయాలు

కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా చోటు చేసుకున్న ఘటన

వెబ్ న్యూస్,బతుకమ్మ : కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా బుధవారం తెల్లవారుజామున  జార్ఖండ్ ఎంపీ మహువా మాజీ వాహనానికి ప్రమాదం జరిగింది.ఈఘటనలో ఆమెకు తీవ్రగాయాలు కావడంతో రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే..  ఎంపీ మహువా తనకుమారుడు, కొడలితో కుంభామేళాకు వెళ్లి బుధవారం తిరిగొస్తుండగా జార్ఖండ్లోని లతేహార్ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ట్రక్కను వీరి కారు ఢీకొంది. ఈఘటనలో ఎంపీకి, వారి కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.