Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 3:36 pm Posted by : ramakrishna

బోధన్ మున్సిపల్ కమిషనర్ గా రాజు బాధ్యతల స్వీకరణ

 బతుకమ్మ, బోధన్ : బోధన్ మున్సిపల్ కమిషనర్ గా నూతనంగా నియమితులైన రాజు మున్సిపల్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాకలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన కమిషనర్‌గా ఛార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వికాస్ మహాతోను  మర్యాదపూర్వకంగా కలసిన ఆయన పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయనతో సుదీర్ఘంగా చర్చించారు. బోధన్ పట్టణం సుందరంగా అభివృద్ధి చెందేందుకు సమిష్టిగా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.మున్సిపల్ పాలనలో పారదర్శకత, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందించడమే తన ప్రాథమిక లక్ష్యమని కమిషనర్ రాజు పేర్కొన్నారు.

Raju assumes charge as Bodhan Municipal Commissioner