బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు
బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహానికి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రత, శాంతి, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం జీవితాన్ని అంకితం చేసిన నాయకుడని స్మరించుకున్నారు. రాజీవ్ గాంధీ వర్ధంతిని దేశవ్యాప్తంగా ఉగ్రవాద వ్యతిరేక దినంగా పాటిస్తున్న సందర్భంగా ప్రతి భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు....