Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:19 pm Posted by : ramakrishna

ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహా నేత రాజీవ్ గాంధీ

 

. . . కాంగ్రెస్ పార్టీ జిల్లా డాక్టర్ సేల్ మెడికల్, హెల్త్ వింగ్ చైర్మన్ డా.సృజిల్ బాబు తెడ్డు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ అభివృద్ధికి యువశక్తిని వినియోగించి ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహానేత రాజీవ్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా డాక్టర్ సేల్ మెడికల్, హెల్త్ వింగ్ చైర్మన్ డా. సృజిల్ బాబు తెడ్డు కొనియాడారు. భారత దేశాన్ని ఆధునిక భారతంగా తీర్చిదిద్దేందుకు విశేష కృషి చేసిన మాజీ ప్రధాని, భారత రత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ నిజామాబాద్ జిల్లా ఖలీల్ వాడి వర్ధన్ హాస్పిటల్ లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు నడిపించిన దూరదృష్టి గల నాయకుడని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి, విద్య, యువత సాధికారత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ధర్మారం అవిన్, డా. తెడ్డు బిందుజ, టీఎంఆర్ పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ మాదిగ, వర్ధన్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ తెడ్డు బాబు పాల్గొన్నారు.