ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి
మద్నూర్, బతుకమ్మ: మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మద్నూర్ మండల కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడూతూ, రాజీవ్ గాంధీని ఆదర్శంగా తీసుకుంటూ, యువత రాజకీయాల్లోకి రావాలన్నారు. ఆనాటి పునాదుల్లో నేడు దేశ పురోగతిని టెక్నాలజీని మనం గమనిస్తున్నామన్నారు. నాడు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ స్వాతంత్రంలో మహాత్మా గాంధీ, నెహ్రూ చేసినటువంటి కృషి, వారు తీసుకొచ్చిన సంస్కరణలను ముందుకు కొనసాగిస్తూ...