ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

భీమ్ గల్, బతుకమ్మ : భారతరత్న,స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజీవ్ గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళాలు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.టెలికమ్యూనికేషన్స్, వాణిజ్య,రక్షణ,విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని, విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని, సాంకేతిక భారత నిర్మాత,యువత, మహిళలకు రాజకీయాలలో పాలుపంచుకోవాడానికి కారకుడయ్యారని అన్నారు....