Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 August 2025, 8:01 pm Posted by : ramakrishna

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

భీమ్ గల్, బతుకమ్మ : భారతరత్న,స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని బుధవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా  రాజీవ్ గాంధీ  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళాలు అర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి టెక్నాలజీకి పెద్దపీట వేశారన్నారు.టెలికమ్యూనికేషన్స్, వాణిజ్య,రక్షణ,విమానయాన సంస్కరణలు ప్రవేశపెట్టారని, విద్యావకాశాల సమానత్వం కోసం నేషనల్ పాలసీ ఫర్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చారని, సాంకేతిక భారత నిర్మాత,యువత, మహిళలకు రాజకీయాలలో పాలుపంచుకోవాడానికి కారకుడయ్యారని అన్నారు. పంచాయితీ రాజ్ చట్టం తెచ్చి గ్రామీణ స్థాయి వరకు అధికార వికేంద్రీకరణ చేసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బోదిరే స్వామి,పట్టణ అధ్యక్షుడు జే జే నర్సయ్య,sc సెల్ అధ్యక్షుడు పర్స అనంతరావ్,జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి నాగేంద్ర బాబు,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్ది అవినాష్,యువజన కాంగ్రెస్ నాయకుడు వాక మహేష్,మండల యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సురేష్,పట్టణ యువజన అధ్యక్షుడు మహేష్,సాయి,జాన్సన్,పల్లె శేఖర్, లింబాద్రి,బోర్రన్న,నారాయణ,శ్రీను, విఘ్నేష్,ప్రవీణ్, రాకేష్,దిలీప్, నవీద్,రాకేష్,అరుణ్,రమేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.