Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 July 2025, 4:09 pm Posted by : ramakrishna

కృపాల్ సింగ్ ను సన్మానించిన కాకతీయ విద్యా సంస్థల అధినేత రజినీకాంత్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పిఆర్టియు తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ ను కాకతీయ విద్యా సంస్థల అధినేత రజినీకాంత్ బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత 32 సంవత్సరాలుగా ఉపాధ్యాయునిగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పుతూ ఉపాధ్యాయ సంఘ నేతగా తోటి ఉపాధ్యాయుల సమస్యలను అధికారుల దృష్టికి  తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. ఆయన శేష జీవితం సుఖసంతోషా లతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ భరద్వాజ్, ఫిజికల్ డైరెక్టర్ అనంత్ కుమార్, హెడ్మాస్టర్ నాగరాజు, రణధీష్, నరేందర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.